Friday, November 22, 2024

Local Fight – విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్…

నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ
14వ తేదిన స్ర్కూటినీ
30వ తేదిన పోలింగ్
సెప్టెంబ‌ర్ 3న కౌంటింగ్
వైసిపి అభ్య‌ర్ధిగా బొత్స బ‌రిలో
కూట‌మి అభ్య‌ర్ధిగా షీలా గోవింద్ వైపు మొగ్గు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – విశాఖ‌ప‌ట్నం – ఎపిలో ఎన్నికల హడావిడీ మళ్లీ మొదలైంది. నేడు విశాఖ జిల్లా ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది.. నేటి నుంచి ఈ నెల 13వరకు నామినేషన్ లు స్వీకరిస్తారు. 14 వ తేదిన స్క్రూటీ ఉండగా.. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అలాగే అదే రోజు తుది అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నారు. 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉండనుంది.

- Advertisement -

మొత్తం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 838 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందులో వైసీపీకి చెందిన ఓట్లు 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. ఇక మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మూడు కలిపితే 841కి ఓటర్ల సంఖ్య పెరగనున్నాయి.

ఇది ఇలా ఉంటే వైసిపి అభ్య‌ర్థిగా మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రంగంలో ఉన్నారు.. కూట‌మి అభ్య‌ర్ధిని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.. అయితే షీలా గోవింద్ కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement