తాను చిన్నప్పటి నుంచీ తెలుగు వింటూ జీవించానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కృష్ణవేణి సంగీత నీరాజనంలో ఆమె పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు సహకరించిన ఏపీ ప్రభుత్వానికి అభినందనలు ఆమె ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఆమె మాట్లాడుతూ దేశ విదేశాల్లో గుర్తింపు రావాలంటే చెన్నె, తమిళనాడు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండేదన్నారు. మొవ్వ, తంజావూరు, రాజమండ్రి, బొబ్బిలి లాంటి ప్రాంతాలు ప్రతి వారు గుర్తుంచుకోవాలని. కార్తీక మాసంలో ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. ఈ గానామృతం ప్రతీ సంవత్సరం దేశ విదేశాలకు వెళ్ళాలని, తెలుగు వింటేనే ఎంతో అద్భుతమైన భావం కలిగిస్తుందని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో సంగీతం నేను ఆస్వాదించానని, సంగీతాన్ని వైద్యంలో కూడా వినియోగిస్తున్నారని చెప్పారు. విదేశాల నుంచీ తెలుగువారు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్మలా సీతారామన్ కోరారు.