తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లు నేడు ప్రజా భవన్ లో కొద్ది సేపటి క్రితం సమావేశమయ్యారు.. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతున్నది. ప్రజా భవన్ కు చేరుకున్న చంద్రబాబు కు రేవంత్ రెడ్డి సాదరపూర్వక స్వాగతం పలికారు
కాగా, గత పదేండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా జరగనున్న ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొంటున్నారు.. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమంత్రుల హోదాలో ఫస్ట్ టైమ్ మీట్ కాబోతోన్న నేపథ్యంలో ఈ భేటీపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ ప్రతినిధులు
సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్
సీఎస్ శాంతి కుమారి
మరో ఇద్దరు అధికారులు
ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిదులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మంత్రులు, కందుల దుర్గేశ్, సత్య ప్రసాద్, బీసీ జనార్ధన్
అధికారులు
సీఎస్ నీరబ్ కుమార్
ఐఏఎస్ కార్తికేయ మిశ్రా
ఐఏఎస్ రవిచంద్ర