Friday, October 18, 2024

AP: మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు వ‌ద్దు…

ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: మ‌ద్యం షాపులకు దేవుళ్ల పేర్లు వద్దని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు. గుంటూరు నగరంలోని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన మద్యం పాలసీ టెండర్లు, లాటరీల ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభమయ్యే సందర్భంలో మద్యం షాపులకు వివిధ మతాలకు చెందిన దేవుళ్ళ పేర్లతో బోర్డులు పెట్టనీయకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎక్సైజ్ శాఖ మంత్రికి, కూటమి ప్రభుత్వానికి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన గతంలో 2014 -2019 వరకు వున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు పెట్టకూడదని జీవో ఇచ్చారని, అదే జీవోను ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, తద్వారా వివిధ మతాల భక్తుల మనోభావాలను, ఆధ్యాత్మికత గౌరవాన్ని చాటిచెప్పేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. దేవుళ్ళ పేరుతో ఈ అపచార కార్యక్రమం జరక్కుండా చర్యలు తీసుకోవాలని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

వివిధ మతాల ప్రార్ధనాలయాలు, ప్రార్థన స్థలాల, పాఠశాలలు, కళాశాలల వద్ద షాపులు ఏర్పాటు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, దాంతో పాటు దేవుళ్ళు, స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకులు పేర్లు లేకుండా, కేవలం ఫ్యాన్సీ పేర్లతోనే మద్యం షాపులకు పెట్టాల్సిన పేర్లపై గత జీవో కొనసాగించేలా కానీ లేదా కొత్త జీవో ఇచ్చే విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement