ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఓ పట్టాన అంతుచిక్కకుండా ఉంటాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎందుకంటే సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణంగా చెబుతున్నారు. ఫస్ట్ టర్మ్ కంప్లీట్ చేసుకున్న మంత్రులను ఒక్కసారిగా రాజీనామాలు చేయించి.. ఆ తర్వాత వారిలో నుంచి 11 మందికి మళ్లీ మంత్రులుగా సెకండ్ టర్మ్‌లో చాన్స్ ఇవ్వడంపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలామంది పార్టీ పెద్దలపై, సీఎం జగన్ తీరుపై గుర్రుగా ఉన్నారు. స్వయానా వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు అయిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఈ సారి మంత్రవర్గ పునర్ వ్యవస్థీకరణలో చాన్స్ ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా బాలినేని శ్రీనివాసులు రెడ్డికి కూడా అవకాశం కల్పించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. అయితే జగన్ ఆలోచన వేరేగా ఉండి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. రాబోయే ఎన్నికల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ నుంచి తప్పించుకునేందుకు ఈసారి వైఎస్సార్‌కు సన్నిహితులు, కుటుంబ నేపథ్యం ఉన్న వారిని కేబినెట్‌కు దూరం పెట్టినట్టు తెలుస్తోందని విశ్లేషిస్తున్నారు.
కాగా, మంత్రివర్గంలో పోర్టుపోలీయోల కేటాయింపులు కూడా సరిగా లేవని చాలామంది పెదవి విరుస్తున్నారు. ఇందులో విడుదల రజనీ (హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్), అంబటి రాంబాబు (నీటిపారుదల శాఖ), తానేటి వనిత (హోం శాఖ), చెల్లుబోయిన శ్రీనివాస్ (బీసీ వెల్ఫేర్, ఐఅండ్‌పీఆర్, సినిమాటోగ్రఫీ) లకు ఇచ్చిన శాఖలు సముచితంగా లేవని.. వారు ఆ శాఖలను ఎలా నిర్వహించగలరో చూడాలని అంటున్నారు పరిశీలకులు..
పెద్ద చదువులు చదివి.. ఐటీ రంగంలో జాబ్ చేసిన అనుభవం ఉండి.. విదేశాల్లో సైత జాబ్ చేసిన విడదల రజనీకి అదే రంగానికి చెందిన ఐటీ శాఖను ఇస్తే బాగుండేదని.. వైద్యశాఖ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.. ఏదేమైనా సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు.. చేపట్టే కార్యక్రమాలు ఎవరికీ అంతుచిక్కవన్నది మరోసారి స్పష్టమవుతోంది..