Friday, November 22, 2024

Analysis: పోర్టుపోలియోలపై పెదవి విరుపు.. ఐటీపై పట్టున్న రజనీకి ఆ శాఖే ఇవ్వాల్సింది..

ఆంధ్రప్రదేశ్​ రాజకీయాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఓ పట్టాన అంతుచిక్కకుండా ఉంటాయంటున్నారు పొలిటికల్​ అనలిస్టులు. ఎందుకంటే సీఎం జగన్​మోహన్​రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణంగా చెబుతున్నారు. ఫస్ట్​ టర్మ్​ కంప్లీట్​ చేసుకున్న మంత్రులను ఒక్కసారిగా రాజీనామాలు చేయించి.. ఆ తర్వాత వారిలో నుంచి 11 మందికి మళ్లీ మంత్రులుగా సెకండ్​ టర్మ్​లో చాన్స్​ ఇవ్వడంపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలామంది పార్టీ పెద్దలపై, సీఎం జగన్​ తీరుపై గుర్రుగా ఉన్నారు. స్వయానా వైఎస్​ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు అయిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డికి ఈ సారి మంత్రవర్గ పునర్​ వ్యవస్థీకరణలో చాన్స్​ ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా బాలినేని శ్రీనివాసులు రెడ్డికి కూడా అవకాశం కల్పించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. అయితే జగన్​ ఆలోచన వేరేగా ఉండి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. రాబోయే ఎన్నికల్లో ఫ్యామిలీ సెంటిమెంట్​ నుంచి తప్పించుకునేందుకు ఈసారి వైఎస్సార్​కు సన్నిహితులు, కుటుంబ నేపథ్యం ఉన్న వారిని కేబినెట్​కు దూరం పెట్టినట్టు తెలుస్తోందని విశ్లేషిస్తున్నారు.

కాగా, మంత్రివర్గంలో పోర్టుపోలీయోల కేటాయింపులు కూడా సరిగా లేవని చాలామంది పెదవి విరుస్తున్నారు. ఇందులో విడుదల రజనీ (హెల్త్​, ఫ్యామిలీ వెల్ఫేర్​, మెడికల్​ ఎడ్యుకేషన్​), అంబటి రాంబాబు (నీటిపారుదల శాఖ), తానేటి వనిత (హోం శాఖ), చెల్లుబోయిన శ్రీనివాస్​ (బీసీ వెల్ఫేర్​, ఐఅండ్​పీఆర్​, సినిమాటోగ్రఫీ) లకు ఇచ్చిన శాఖలు సముచితంగా లేవని.. వారు ఆ శాఖలను ఎలా నిర్వహించగలరో చూడాలని అంటున్నారు పరిశీలకులు..

పెద్ద చదువులు చదివి.. ఐటీ రంగంలో జాబ్​ చేసిన అనుభవం ఉండి.. విదేశాల్లో సైత జాబ్​ చేసిన విడదల రజనీకి అదే రంగానికి చెందిన ఐటీ శాఖను ఇస్తే బాగుండేదని.. వైద్యశాఖ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని అంటున్నారు పొలిటికల్​ అనలిస్టులు.. ఏదేమైనా సీఎం జగన్​ తీసుకునే నిర్ణయాలు.. చేపట్టే కార్యక్రమాలు ఎవరికీ అంతుచిక్కవన్నది మరోసారి స్పష్టమవుతోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement