Tuesday, December 3, 2024

Kadapa | ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి : జగన్

పులివెందుల, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ) : వెలుగుల పండుగ దీపావళి తెలుగు వారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement