Monday, November 25, 2024

Rain Alert: ఏపీకి వాన గండం.. 24 గంటల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. నేటికీ చాలా ప్రాంతాలు వరద నీటిలోనే బిక్కుబిక్కుమంటున్నాయి. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకావం ఉంది. శుక్రవారం దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement