Saturday, November 23, 2024

విస్తరిస్తున్న నైరుతి, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ: నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు మరియు దానిని ఆనుకుని ఉండే ఆగ్నేయ బంగాళాఖాతంకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 2.1 కి.మీ మరియు 5.8 కి.మీ ఎత్తువరకు విస్తరించిఉన్నది . ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉంటు-ందని దీని ఫలితంగా ఉత్తర కోస్తాలో సోమవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మంగళవారం తేలిక పాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement