Friday, November 22, 2024

Nagarjuna Sagar: నాగార్జున‌సాగ‌ర్ లో ఆరు గేట్ల ఎత్తివేత – వీడియోతో…

ఎగువ నుంచి భారీగా నీరు
ప్ర‌స్తుతం ఆయిదు ఫీట్ల మేర‌ గేట్లు ఓపెన్
దిగువ‌కు 30వేల క్యూసెక్కుల నీరు విడుద‌ల


ఆంధ్ర‌ప్రభ స్మార్ట్ – నాగార్జున‌సాగ‌ర్ : నాగార్జున సాగర్‌ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు సీఈ ఉదయం 11గంటలకు నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతుండడంతో అధికారులు ఆరు గేట్ల‌ను 5ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఒక్కొక్క గేట్ నుండి 5 వేలు.. మొత్తం 30వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. సాయంత్రం వరకు స్పీల్ వే ద్వారా 2లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశముంది. నల్లగొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

ఇన్ ఫ్లో … ఔట్ ఫ్లో…
సాగర్ ఇన్ ఫ్లో: 2, 79,000 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో: 30,000 క్యూసెక్కులు. పూర్తి నీటి మట్టం: 590.00 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం: 580 అడుగులు. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 312.50 టీఎంసీలు. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం : 280 టీఎంసీకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. సాగర్ దిగువన ఉన్న కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సాగర్ నిండిపోవడంతో ఆయకట్టు రైతులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement