Tuesday, November 26, 2024

Order Order | హత్య కేసులో 13 మందికి యావజ్జీవ శిక్ష.. అడ‌వుల గ్రామంలో దారుణ ఘ‌ట‌న‌పై తీర్పు

బాపట్ల, (ప్రభ న్యూస్‌): చట్టం ఎవరికి చుట్టం కాదని నేరారోపణ రుజువైనప్పుడు కచ్చితంగా శిక్ష తప్పదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్ అన్నారు. బుధవారం బాపట్ల జిల్లా నిజాంపట్నం మండల పరిధిలోని అడవుల దీవిలో సంచలనం రేకెత్తించిన కేసులో ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ తెనాలి 11వ ఏ డి జె కోర్టు న్యాయమూర్తి మాలతీ ఇవ్వాల (బుధ‌వారం) తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కేసు వివరాలను వెల్లడించారు.

2016 సంవత్సరంలో నిజాంపట్నం మండలం అడవుల దీవి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అడవుల గ్రామంలో ముస్లిం కాలనీలో నివసించే జాస్మిన్‌ అనే మహిళకు తన ప్రియుడు శ్రీ సాయి అనే వ్యక్తికి మధ్య ఉన్న ప్రేమకు సంబంధించి ఇంట్లో పెద్దల పెళ్లికి అంగీకరించకపోవడంతో యువతి ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. జాస్మిన్‌ మరణానికి శ్రీసాయి కారణమని భావించిన గ్రామస్తులు శ్రీసాయిని అతని స్నేహితుడు పవన్‌ కుమార్‌ ను చెట్టు-కు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టగా శ్రీసాయి గాయాలపాలై మరణించాడని చెప్పారు.

అప్పటి సీఐ పెంచల రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని అప్పటినుండి కోర్టులో -టైల్‌ రాన్‌ నడుస్తుందన్నారు. ఈ ఘటనపై అప్పట్లో 21 మందిపై కేసులు నమోదు చేయగా నలుగురు మృతి చెందారని, మరో నలుగురు కు కేసు నుండి రిలీఫ్‌ చేసి మిగిలిన 13 మందికి నిందితులుగా తేలుతూ కోర్టు శిక్ష వెలువరించిందన్నారు.

- Advertisement -

నేరస్తులకి శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం
నేరస్తులకి శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని ఎస్పి వకుల్‌ జిందాల్‌ చెప్పారు. కేసులో నేరస్తులను అదుపులోకి తీసుకొని రేపల్లె డిఎస్పి మురళీకృష్ణ పర్యవేక్షణలో రేపల్లె రూరల్‌ సీఐ శివశంకర్‌ సూచనలతో అడవుల దీవి ఎస్సై వెంకట్‌ రవి సిబ్బంది సహాయంతో సాక్షుల ద్వారా సరైన పద్ధతిలో నిర్భయంగా సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదు ఇచ్చి సరైన సమయంలో కోర్టుకు హాజరు పరిచి న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించగా తెనాలి న్యాయమూర్తి మాలతి మొత్తం 21 మందిలో నలుగురు చనిపోగా మరో నలుగురిని కేసు నుండి రిలీఫ్‌ చేసి మిగిలిన 13 మందిని నిందితులుగా తేల్చి శిక్ష విధించారని చెప్పారు. కేసు ఫైనల్‌ జడ్జిమెంట్‌ కు రావడానికి కృషిచేసిన బాపట్ల జిల్లా ఏఎస్పి మహేష్‌, పోలీస్‌ అధికారులు మరియు కోర్టు మానిటరింగ్‌ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement