అమరావతి – వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితన పదవులను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని బిజెపి ఎపి అధ్యక్షురాలు డి పురందేశ్వరి ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. విజయసాయి రెడ్డి పలువురిని బెదిరిస్తూ అక్రమాలకు దిగారని ఆరోపణలు ఉన్నాయని, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జిగా వున్న సమయంలో కడప గూండాలను దించి అక్కడ భూ ఆక్రమణలు కు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక.. వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఆయన గుండెపోటుతో మరణించారని ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఆయనపై ఉన్న కేసుల వివరాలను పేర్కొంటూ.. వెంటనే విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పురందేశ్వరి కోరారు.
Letter to CJI – విజయసాయి ఎంపి సభ్యత్వం రద్దు చేయండి.. సుప్రీంకు పురందేశ్వరి లేఖ
Advertisement
తాజా వార్తలు
Advertisement