పాఠశాల కేంద్రంగా అమలవుతున్న విద్యా విధానాలు క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని, పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాఠశాల విద్య సంచాలకులు, కమిషనర్ వి.విజయరామరాజు అన్నారు. శుక్రవారం ఉదయం కర్నూలు నగరంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కర్నూలు ఉమ్మడి (కర్నూలు- నంద్యాల) జిల్లాల్లోని పాఠశాలలను బలోపేతం చేయడం, జీవో నెంబర్ 117 ఉపసంహరణ అనంత పరిణామాలు, అని ప్రత్యామ్నాయ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించినందున పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అధికారులు, జెడ్పీ సీఈవోలు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో డీఈఓ శ్యామ్యూల్ పాల్, ఉమ్మడి జిల్లాల డివిజనల్ ఉపవిద్యాధికారులు, నియోజకవర్గ అధికారులు, మండల విద్యాధికారులు 1, 2, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.