Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దాం.. కలెక్టర్ల సదస్సులో పవన్

AP ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దాం.. కలెక్టర్ల సదస్సులో పవన్

0
AP ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దాం.. కలెక్టర్ల సదస్సులో పవన్

ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం రూ.10లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ షిప్‌లో ఏపీలో సుస్థిర పాలనను అందిచేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ….. స్మగ్లింగ్‌పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్‌లో కూడా కల్తీ పెరిగిపోతోందని అంటూ స్వయానా మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.

అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

Exit mobile version