Tuesday, November 26, 2024

వ్యవస్థలో మార్పు కోసమే ‘జగనన్నకు చెబుదాం’

వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకే ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ లాంఛనంగా ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్‌ చేస్తారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చన్నారు.సంక్షేమ పథకాలు, వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే 1902కు ఫోన్ చేసిన వారి స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు చేయవచ్చన్నారు.

రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కారం కోసం 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుందన్నారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. దీనికి ఏం చేయాలంటే… మీ సమస్యను తెలియచేసేందుకు తొలుత 1902 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. కాల్‌ సెంటర్‌ ప్రతినిధికి మీ సమస్యను చెప్పాలన్నారు. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని వైయ‌స్ఆర్‌ (యువర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌) ఐడీని కేటాయిస్తారన్నారు. మీ అర్జీ స్టేటస్‌ గురించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అప్‌డేట్‌ అందుతుందన్నారు. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement