చేనేతల జోలికి వస్తే తెలుగుదేశం పార్టీ చూస్తే ఊరుకోదని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. ధర్మవరం చేనేత వ్యాపారులను టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ పరామర్శించారు. మాజీ మంత్రి పరిటాల సునీతతో కలిసి అనురాధ ధర్మవరం చేరుకున్నారు. అలాగే ఆమె వెంట మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఉన్నారు. వ్యాపారులు చేపట్టిన బంద్ కు అనురాధ మద్దతు తెలిపారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… దాడికి గురైన వ్యాపారులను ఇంటికి పిలుచుకొని పరామర్శిస్తావా అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి చేనేత వ్యాపారులు అంటే చిన్నచూపు అన్నారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయవాడకు వెళ్లి ఆందోళన చేసేవారన్నారు. పరిటాల శ్రీరామ్ సమయానికి ఇక్కడ లేరని, అమెరికాలో ఉన్నారన్నారు. ఆయన సంఘటన జరిగినప్పటి నుంచి తమతో మాట్లాడుతూనే ఉన్నారన్నారు. పరిటాల శ్రీరామ్ ఉండి ఉంటే ఇక్కడ స్పందన వేరేగా ఉండేదన్నారు. ధర్మవరంకు జోలె పట్టుకుని వచ్చి ఓట్లు అడిగావు… మర్చిపోయావా కేతిరెడ్డి అని ప్రశ్నించారు. ఈరోజు గుర్రాల కోట కట్టుకుని.. చేనేతలను అవమానిస్తున్నావన్నారు. టీడీపీ స్పందించిన తరువాతే విజయవాడలో దాడి చేసిన అవినాష్ ను అరెస్టు చేశారన్నారు.