Monday, November 18, 2024

AP: బొగ్గు తవ్వకాలు అంతం చేద్దాం.. రవి రెబ్బాప్రగడ

విశాఖపట్నం, సెప్టెంబర్ 13(ప్రభ న్యూస్) : ఆసియాలో బొగ్గును అంతం చేయడానికి కొత్త ఉత్సాహంతో, వేగవంతమైన ప్రచార ప్రయత్నాన్ని ప్రారంభిద్దామని మైన్స్ మినరల్స్ అండ్ ప్యూపెల్స్ జాతీయ చైర్పర్సన్ రెబ్బాప్రగాడ రవి పేర్కొన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటికి, అరకు పర్యాటక ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలు ఆపాలి, భూగర్భలో ఉన్న ఇంధన వనరల వెలికితీత తగ్గించాలి, సోలార్ వినియోగం పెంచాలి, ప్రతిచోటా విండ్ పవర్ ప్లాంట్స్, మైక్రో హైడల్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ప్లే కార్డులు పట్టుకొని భారీ ర్యాలీ చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో చైర్ పర్సన్ మాట్లాడుతూ… అభివృద్ధి చెందుతున్న దేశాలు చైనా, భారత్, ఇండోనేసియా, జపాన్, తాయిలాండ్, ఫిల్పియునిస్, వియోత్నం వంటి దేశాల్లో బొగ్గు తవ్వకాలు ఎన్నో మంజూరై ఉన్నాయని, వాటిని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రయత్నాన్ని 2024 ఈనెల 13న ఆసియా చర్యా దినంగా ప్రారంభించిందన్నారు. బొగ్గు తవ్వకాలు అంతం చేద్దాం అనే లక్ష్యాన్ని సాధిద్దామనే నినాదంతో కార్యక్రమం చేపట్టామన్నారు. తాము చేపట్టే ఈ చర్యలు ప్రభుత్వాలకు, ప్రజాసంస్థలకు, ప్రైవేట్ ఫైనాన్సియర్లకు, కార్పొరేషన్‌లకు కోల్‌ను అంతం చేయాలని, కొత్త కోల్ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేసి, ప్రస్తుతం ఉన్న కోల్‌ను వేగంగా తగ్గించాలని బలమైన సందేశాన్ని పంపాలనే తమ ముఖ్య ఉద్దేశమ‌న్నారు. బొగ్గుకు వ్యతిరేకంగా చేసిన ఏళ్ల తరబడి పోరాటాలు, ప్రచారాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యమైన విజయాలను సాధించాయన్నారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా నిర్వహణలో ఉన్న బొగ్గు సామర్థ్యం, వినియోగంలో తగ్గుదల కనిపించిందని పేర్కొన్నారు.

- Advertisement -

అయితే ఇప్పుడు కోల్ మళ్లీ పుంజుకుంటోందన్నారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా 69.5జీ. డబ్ల్యూ సామర్థ్యం ఉన్న కోల్ శక్తిని ఆన్‌లైన్‌లోకి తెచ్చారు, 2016 తర్వాత ఉన్నత స్థాయి పెరుగుదల నమోదైందని స్పష్టం చేశారు. నిర్మాణం ముందు దశలో ఉన్న మొత్తం గ్లోబల్ సామర్థ్యం కూడా 2023లో 6శాతం పెరిగిందన్నారు.. కొత్త బొగ్గు తిరిగి ఉద్భవించే ప్రమాదాన్ని అడ్డుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాక ప్రస్తుతం ఉన్న బొగ్గు, వాడకం తగ్గించిన కోల్, స్వచ్ఛంద కోల్‌ను వేగంగా, న్యాయంగా తక్కువ చేయాల్సిన సవాల్ ను కూడా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement