Friday, November 22, 2024

Srikakulam: ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం.. ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం, జూన్ 23 : ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒలింపిక్ డే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఓబిఎస్ వద్దనున్న పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వరకు ఈ ప్రత్యేక పరుగు సాగింది.

అనంతరం స్టేడియం ఆవరణలో జరిగిన క్రీడాకారులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చిన్న వయసులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ, దానికి క్రమశిక్షణ తోడైతే మంచి క్రీడాకారులుగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రోజూ ఒక గంట క్రీడలకు కేటాయిస్తే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు దోహదం కాగలమని చెప్పారు. క్రీడలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి, ఒలింపిక్ అసోసియేషన్ పూర్వ కార్యదర్శి సుందర రావు మాస్టారు, ప్రస్తుత కార్యదర్శి ఎం.సాంబ మూర్తి, సెట్ శ్రీ సీఈవో బి.ప్రసాదరావు, డీఎస్డీఓ కే.శ్రీధర్, ఉపాధ్యక్షులు శిమ్మ రాజశేఖర్, చిట్టి నాగభూషణం, మధుసూధనరావు, సహాయ కార్యదర్శి కొమర భాస్కర రావు, కోశాధికారి వై.పోలినాయుడు, పి.ఈ.టి అసోసియేషన్ అధ్యక్షులు రమణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement