Monday, November 25, 2024

తిరుమ‌ల ఘాట్ రోడ్డులో చిరుత‌..

ప‌లువురు భ‌క్తులు తిరుమ‌ల ఘాట్ రోడ్డులో చిరుత‌ను చూసిన‌ట్లు టిటిడి అట‌వీశాఖ అధికారులు చెబుతున్నారు. చిరుత సంచారంతో భక్తుల్లో టెన్షన్ మొదలైంది. ఇక 4న బంగారు రథాన్ని అధిరోహించి మాడ వీధులలో విహరించిన తర్వాత.. వసంతమండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవ మూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మళ్లీ సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. దీంతో ఏప్రిల్‌ 4న అష్టదళపాదపద్మారాధన, 3 నుంచి 5 వరకు ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం స్వామివారిని 63,535 మంది భక్తులు దర్శించుకున్నారు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లు వచ్చింది. 24,349 మంది భక్తుల తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 3 నుంచి 5 వరకు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. 3న ఉదయం 7 గంటలకు శ్రీవారు కొండపైన మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపంలో అభిషేక నివేదనల తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement