– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పవన్‌కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఇవ్వాల (ఆదివారం) రాత్రి ఆయన తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాన్ మాట్లాడుతూ చాలా సీరియస్ అంశాలను లేవనెత్తారు. గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవకుండా చూస్తానన్నారు. ప్రశ్నించేవారిపై దాడులకు పాల్పడుతున్నారని, నా ఒంటిమీద చెయ్యిపడ్డా తన్ని తగలేస్తానన్నారు పవన్ కల్యాణ్.
ఇక.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని, వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. అప్పుడు ఒక్కక్కరిని ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతామని హెచ్చరించారు. అక్కా చెల్లెల్లపై చేయిపడితే చూస్తూ ఊరుకోబోనన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అడ్డు వచ్చే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఇక తాము అధికారంలోకి వచ్చాక.. అక్కా చెల్లెల్లపై చేయి వేస్తే కాళ్లు, చేతులు విరగ్గొట్టే చట్టాలు తీసుకొస్తానన్నారు పవన్ కల్యాణ్.
జగన్ అనే అనకొండా తన సొంత చిన్నాన్ననే మింగేసిందని, డ్రైవర్ని చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని, ద్వారంపూడి దగ్గరికి వెళ్లి కాపాడమని అడిగారని చంపింది కాపు, చనిపోయింది దళితుడు, కాపాడింది మాత్రం రెడ్డి అని మండిపడ్డారు. ఇలా చేయడంతో సామాజిక వర్గాల్లో విభేదాలోస్తున్నయన్నారు. అనంతబాబు కేసును కాపులకు అంటగట్టొదని పవన్ కోరారు. అక్రమాలన్నీ ద్వారంపూడికి కనెక్ట్ అవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు అంతర్వేదిలో రథాన్ని తగలెట్టిన వారిని పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 15 రోజుల్లో రాజోలు రోడ్డు వేయకుంటే తామే వేయిస్తామని చెప్పారు పవన్ కల్యాణ్. ఇక.. ప్రభుత్వ పెద్దలంతా ఫ్యాక్షనిస్టులేనని, ఇసుక మాఫియాను అడ్డుకుంటానని, అలా అడ్డుకోకపోతే తనపేరు పవన్‌కల్యాణే కాదు అని శపథం చేశారు. సీఎం జగన్‌పట్ల తనకు ద్వేషం లేదని, కానీ, బాంఛన్ అని మొక్కడానికి తాను రెడీగా లేనన్నారు.