Friday, November 22, 2024

Big Breaking | కాళ్లు, చేతులు విరగ్గొట్టే చట్టాలు తెస్తా .. వారాహి యాత్రలో పవన్​​

ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని, ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​. ఇంత జరిగినా సీఎం జగన్​ చూస్తూ ఊరుకుంటున్నారు కానీ, పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన సొంత చిన్నాన్ననే చంపేసి జగన్​ పెద్ద అనకొండలా మారారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఆడపిల్లలపై చేయివేస్తే కాళ్లు, చేతులు విరగ్గొట్టే చట్టాలు తెస్తామని ఉద్వేగంగా చెప్పారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఆంధ్రప్రదేశ్​లో జనసేన పవన్​కల్యాణ్​ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఇవ్వాల (ఆదివారం) రాత్రి ఆయన తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్​ కల్యాన్​ మాట్లాడుతూ చాలా సీరియస్​ అంశాలను లేవనెత్తారు. గోదావరి జిల్లాల్లో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఒక్క సీటు గెలవకుండా చూస్తానన్నారు. ప్రశ్నించేవారిపై దాడులకు పాల్పడుతున్నారని, నా ఒంటిమీద చెయ్యిపడ్డా తన్ని తగలేస్తానన్నారు పవన్​ కల్యాణ్​.

ఇక.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని, వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. అప్పుడు ఒక్కక్కరిని ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతామని హెచ్చరించారు. అక్కా చెల్లెల్లపై చేయిపడితే చూస్తూ ఊరుకోబోనన్నారు పవన్​. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అడ్డు వచ్చే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఇక తాము అధికారంలోకి వచ్చాక.. అక్కా చెల్లెల్లపై చేయి వేస్తే కాళ్లు, చేతులు విరగ్గొట్టే చట్టాలు తీసుకొస్తానన్నారు పవన్​ కల్యాణ్​.

జగన్​ అనే అనకొండా తన సొంత చిన్నాన్ననే మింగేసిందని, డ్రైవర్​ని చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్​ డెలివరీ చేశారని, ద్వారంపూడి దగ్గరికి వెళ్లి కాపాడమని అడిగారని చంపింది కాపు, చనిపోయింది దళితుడు, కాపాడింది మాత్రం రెడ్డి అని మండిపడ్డారు. ఇలా చేయడంతో సామాజిక వర్గాల్లో విభేదాలోస్తున్నయన్నారు. అనంతబాబు కేసును కాపులకు అంటగట్టొదని పవన్​ కోరారు. అక్రమాలన్నీ ద్వారంపూడికి కనెక్ట్​ అవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు అంతర్వేదిలో రథాన్ని తగలెట్టిన వారిని పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 15 రోజుల్లో రాజోలు రోడ్డు వేయకుంటే తామే వేయిస్తామని చెప్పారు పవన్​ కల్యాణ్​. ఇక.. ప్రభుత్వ పెద్దలంతా ఫ్యాక్షనిస్టులేనని, ఇసుక మాఫియాను అడ్డుకుంటానని, అలా అడ్డుకోకపోతే తనపేరు పవన్​కల్యాణే కాదు అని శపథం చేశారు. సీఎం జగన్​పట్ల తనకు ద్వేషం లేదని, కానీ, బాంఛన్​ అని మొక్కడానికి తాను రెడీగా లేనన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement