Friday, November 22, 2024

రాష్ట్ర సరిహద్దులో.. అక్ర‌మంగా వెండి త‌ర‌లింపు..

తడ,(ప్రభన్యూస్‌):జిల్లా సెబ్‌ అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భీములవారిపాళెం వద్ద సెబ్‌ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి చెన్నైకు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేయగా ఓ వ్యక్తి అనుమానస్పదంగా వ్యవహరించడంతో అతడి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించారు అధికారులు.. భారీగా వెండి, నగదును ఉండడాన్ని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిన వ్యక్తి చెన్నైకు చెందిన మనోహర్‌గా గుర్తించారు.

ఇతను హైదరాబాద్‌లో తక్కువ ధరకు వెండిని కొనుగోలు చేసి చెన్నైలోని దుకాణ దారులకు విక్రయాలు సాగిస్తూ ఉండాటని ఎటువంటి బిల్లులు లేకుండా వెండిని తరలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మనోహర్‌ వద్ద నుంచి 27.27 కేజీల వెండితో పాటు రూ 50,600ల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అతనితో పాటు వెండి, నగదును స్థానిక పోలీసులకు అప్పగించినట్లు సెబ్‌ సీఐ ఆర్‌యువీఎస్‌ ప్రసాద్‌ తెలియజేశారు. ఈ తనిఖీలలో సెబ్‌ ట్రైనీ ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement