విజయవాడ, ప్రభ న్యూస్ : నిబంధనలు అతిక్రమించి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న వారిపై లీగల్ మెట్రాలజి అధికారులు కొరడా ఝులిపించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అక్రమార్కులపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు.
లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ ఎ.కృష్ణ చైతన్య నేతృత్వంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పలు బంగారు దుకాణాలు, స్వీట్ల దుకాణాలు, దీపావళి టపాసుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దీపావళి సందర్భంగా గత మూడు రోజులుగా అధికారులు ఈ తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు.
ఇందులో ప్యాకేజీ కమ్యూనిటీ రూల్స్ ఉల్లంఘించిన వ్యాపారాలను గుర్తించి 41 కేసులను నమోదు చేశారు. వీటిలో 8 బంగారు షాపులు, 30 దీపావళి టపాసుల దుకాణాలపై, 3 స్వీట్ షాపులపై కేసులను నమోదు చేశారు. ఎక్కడైనా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం నిర్వహిస్తే వినియోగదారులు ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్ 1967కు చేయవచ్చని డిప్యూటీ కంట్రోల్లో లీగల్ మెట్రాలజీ ఏ కృష్ణ చైతన్య ఈ సందర్భంగా తెలిపారు.
ఇందులో ప్యాకేజీ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారాలను గుర్తించి 1 కేసులు నమోదు చేశారు. ఇందులో 8 బంగారు దుకాణాలు, 30 దీపావళి టపాసుల దుకాణాలు, 3 స్వీట్ షాపులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ ఎ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వ్యాపారం నిర్వహిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
నందిగామ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ యు భాను ప్రసాద్, గుడివాడ అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ రాజేంద్ర ప్రసాద్, విజయవాడ అసిస్టెంట్ కంట్రోలర్ డి కుమారి, విజయవాడ సర్కిల్ వన్ ఇన్‌స్పెక్టర్ మునిరాజా, విజయవాడ సర్కిల్ టూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, మచిలీపట్నం ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్ రావు, గుడివాడ ఇన్‌స్పెక్టర్ కె నంగామ ప్రకాష్ రావు, ఈ దాడుల్లో పాల్గొన్నారు.