టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్న టీటీడీ ఈవో.. ఇప్పుడు దళారీ వ్యవస్థను నిర్మూలించడంపై దృష్టి సారించారు. అందులో భాగంగా నేడు (బుధవారం) తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో పోలీసు, టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ… తిరుమల శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న దళారులను గుర్తించి వారిపై ఎప్పటికప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇప్పటివరకు దళారులనపై నమోదైన కేసులను వారం రోజుల్లో పరిష్కరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వసతి, దర్శనం, అర్ధతసేవ టిక్కెట్ల విషయంలో భక్తులను మోసం చేస్తున్న దళారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈఓ అధికారులను ఆదేశించారు.