అమరావతి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి ఇంధన సామర్థ్య ప్రయోజనాలను అందజేయడంలో భాగంగా గ్రామ ఉజాల పథకం కింద రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయనున్నారు. ఇందుకుగానూ ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీసెస్ లిమి-టె-డ్ (ఈఈఎస్ ఎల్)తో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమి-టె-డ్ (సీఈఎస్ ఎల్) ఎల్ఈడీ బల్బుల పంపిణీకి సహకరించాలని రాష్ట్ర విద్యుత్ సంస్థల సహకారాన్ని కోరాయి. ఈమేరకు సీఈఎస్ఎల్ ఎండీ మరియు సీఈవో మహువా ఆచార్య రాష్ట్ర ఇంధన కార్యదర్శి శ్రీధర్‌కు సమాచారం అందించారు. ఆజా దీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా గ్రామ్ ఉజాల కార్యక్రమాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ 2021 డిసెంబర్ 14న ప్రారంభించారని తెలిపారు. ఫలితంగా సీఈఎస్ఎస్ ఏపీ సహా ఐదు రాష్ట్రాల్లో 10 లక్షలకుపైగా ఎల్ ఈ డీ బల్బులను పంపిణీ చేసిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎల్ఈడీ బల్బుల పంపిణీతో విద్యుత్ వినియోగదారులకు కొంతవరకు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించిన సహాయ సహకారాలతో సీఈఎస్ఎల్ డిసెంబర్ 14, 2021న రాష్ట్రంలోని 3 జిల్లాల్లో లక్షకు పైగా ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేసిందని ఆమె వివరించారు. దేశ వ్యాప్తంగా కోటి ఎల్ఈడీ బల్బుల పంపిణీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు.
ఈలక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రంలో ఎల్ఈడీ బల్బుల పంపిణీలో నిరంతర సహకారం అందించాలని డిస్కమ్‌లను ఆమె అభ్యర్థించారు. ఎల్ఈడీ బల్బుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్‌తో పాటు- ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, తెలంగాణ తదితర నాలుగు రాష్ట్రాల్రు కూడా ఎంపి-కై-నట్లు- తెలిపారు. ఎల్ఈడీ బల్బుల పంపిణీకి అయ్యే మొత్తం ఖర్చును సీఈఎస్ఎల్ భరిస్తుందని ఆమె స్పష్టంచేశారు. అదే సమయంలో రాష్ట్ర విద్యుత్ సంస్ధలపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన ఎలాంటి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని వెల్లడించారు. ఇందుకోసం వినియోగదారుడు బల్బుకు రూ.10 చెల్లిస్తే మిగిలిన ఖర్చును సీఈఎస్ఎల్ భరిస్తుందని పేర్కొన్నారు. తమ ద్వారా పంపిణీ చేయనున్న ఎల్ఈడీ బల్బులు అధిక శక్తి సామర్థ్యాలను కలిగి ఉండటంతోపాటు-, అధిక నాణ్యతను కలిగి ఉంటాయన్నారు. దీనివల్ల అవి దీర్ఘకాలం మన్నుతాయన్నారు. సాధారణంగా ప్రకాశించే బల్బులతో పోల్చినప్పుడు ఈ బల్బులు 88 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయన్నారు. ఎల్ ఈ డీ లైటింగ్ -టె-క్నాలజీ సాధారణంగా ప్రకాశించే లైటింగ్ కంటే 25 రెట్లు- ఎక్కువ ఉంటు-ందన్నారు.
గ్రామీణ ఉజలతో మేలు : శ్రీధర్
ఈ సందర్భంగా ఇంధన కార్యదర్శి బి శ్రీధర్ మాట్లాడుతూ, నిరంతరాయ, నాణ్యమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌ను అందించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నొక్కిచెప్పారన్నారు. గ్రామ ఉజాలా ప్రాజెక్ట్ రాష్ట్రాల లక్ష్యంపై మంచి ప్రభావం చూపుతుందని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు ఇంధన సామర్థ్య చర్యలను అలవర్చడంలో చొరవ చూపినందుకు సీఈఎస్ ఎల్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.