Thursday, November 21, 2024

Follow Up: లీకేజీ మాస్టర్​ నారాయణే.. అధినేత అరెస్టుతో బయటపడుతున్న బాగోతాలు!

నాణ్యత లేని నారాయణ విద్యా సంస్థలు.. చదువుల పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇంతకాలం ఇబ్బందులకు గురిచేసిన వార్తలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. స్కూళ్లలో హైఫై సౌలతులంటూ డబ్బులు దండుకుని.. ఎటువంటి ఫెసిలిటీస్ క‌ల్పించ‌కుండా నాట‌కాలు ఆడార‌న్న విషయం తేటతెల్లమవుతోంది. విద్యా ప్రమాణాలను నట్టేట ముంచిన నారాయణ విద్యాసంస్థల బాగోతాలు తేట‌తెల్లం అవుతున్నాయి. ఇంతకాలం మాస్​ కాపీయింగ్, ముందస్తు లీకేజీల తోనే ర్యాంకులు సాధించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత ఏడాది టెన్త్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్ జ‌ర‌గ‌డం, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు రావ‌డంపై ఏపీ సర్కార్ సీరియస్​గా ఉంది. అయితే.. వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు చెడ్డపేరు తేవాలన్న తలంపుతోనే నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఇదంతా ప్లాన్​ చేశారా? అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ సీఎం ఆదేశాలతో నారాయణను ఇవ్వాల హైదరాబాద్​లో పకడ్బందీ ప్లాన్​తోనే పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ మధ్య కాలంలో ఏపీలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం హాట్​ టాపిక్​గా మారింది. వాట్సాప్‌లో నారాయణ విద్యా సంస్థల సిబ్బంది షేర్‌చేసిన విధానం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. దీనిపై చిత్తూరు జిల్లా పోలీసుల నిశిత దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 4వ తేదీన నారాయణ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌ సహా మరికొందరిని అరెస్టు చేయడంతో వారి ద్వారా అసలు లోగుట్టు బయటపడినట్టు తెలుస్తోంది.

ఇక.. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది వినియోగించిన ఫోన్లలోనూ కీలక డేటా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే.. ఎవరి ఆదేశాలమేరకు ఈవ్యవహారాన్ని నడిపారన్న దానిపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నేళ్లుగా ఈ వ్యవహారాలను నడుస్తున్నాయన్నదానిపై కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తులో భయంకర నిజాలు వెలుగుచూస్తున్నట్టు తెలుస్తోంది. తమ సంస్థలకు ర్యాంకులకోసం నారాయణ సిబ్బంది బరితెగించినట్టు ఒక్కో ఆధారాలు బయటకి వస్తున్నాయి. ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి, షేర్‌చేసి తమవారికి ఎక్కువ మార్కుల వచ్చేలా అక్రమాలకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తేలింది.

దీనిపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తును అల్లకల్లోలం చేసే వ్యవహారాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి ఏపీ ప్రభుత్వం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది సహా పలువురు టీచర్లను అరెస్టు చేసి రిమాండ్​కు పంపింది. ఈ కేసులో మరింత లోతుల్లోకి వెళ్లి దర్యాప్తు చేపట్టగా విద్యాసంస్థల అధినేత అసలు మాస్టర్​ అనే అంశాలు తెలియడంతో పోలీసులు ఎట్టకేలకు ఇవ్వాల హైదరాబాద్​లో అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement