Saturday, November 23, 2024

బొగ్గు ఉత్పత్తిలో ముందడుగు.. మరో మైలురాయిని దాటిన ఏపీ ఎండీసీ

ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఏపీఎం డీసీ) మరో మైలురాయిని అధిగమించింది. జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్‌ ఇండియాల సరసన ఇతర రాష్ట్రాల్లో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న మూడో ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపును సాధించింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గు గనిని దక్కించుకున్న ఏపీఎండీసీ ఈ నెల పదో తేదీ నుంచి ఈ గనిలో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. 2007లోనే కేంద్రప్రభుత్వం ఈ బొగ్గుగని ఏపీఎండీసీకి కేటాయించినా, వివిధ కారణాల వల్ల మైనింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు.

సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్య తలు స్వీకరించిన తరువాత సుల్యారీ కోల్‌ మైన్స్‌ను ప్రతిష్టా త్మకంగా తీసుకున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఎదురవు తున్న ఆటంకాలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించ డంతో గతేడాది ఆగస్టు నెలలో సుల్యా రీలో బొగ్గు వెలికితీత పనులకు శ్రీకారం చుట్టారు. ఓవర్‌ బర్డెన్‌ పనులు పూర్తి చేసుకుని తాజాగా వాణిజ్య సరళి బొగ్గు ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఏపీఎండీసీ విస్తరణలో కీలక ముందడుగు వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement