Tuesday, November 26, 2024

AP: గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌లో ఆగంత‌కుడు

జ‌గ‌న్ అక్క‌డే ఉన్న స‌మ‌యంలో అనుమాన స్ప‌ద క‌ద‌లిక‌లు..
లండ‌న్ వెళ్లేందుకు స‌తీమ‌ణితో వచ్చిన ముఖ్యమంత్రి
అనుమానంతో ఆగంత‌కుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎన్ ఆర్ ఐ డాక్ట‌ర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తింపు
జ‌గ‌న్ పర్య‌ట‌న వివరాల‌ను ఇత‌రుల‌కు పంపిన లోకేష్
వివ‌రాలు అడిగితే గుండేపోటు అంటూ డ్రామా

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ముగియడంతో విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి గ‌త రాత్రి విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్ట్‌) నుంచి బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, మల్లాది విష్టు తదితర వైసీపీ నేతలు సెండాఫ్ ఇచ్చారు. ఈ నెల 31వ తేదీ తిరిగి బెజవాడ చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

- Advertisement -

ఎయిర్ పోర్ట్ ఆగంత‌కుడు …
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు. లోకేష్‌కి అమెరికన్ సిటీజన్ షిప్ ఉన్నట్టు కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్ లు ముందుగానే లోకేష్ పెట్టినట్టు గుర్తించారు. సీఎం జగన్‌ వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్ కనపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో గుండె పోటు వచ్చిందని లోకేష్ చెప్ప‌డంతో ఆ వెంటనే లోకేష్‌ను ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు. అయితే, సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు లోకేష్‌కి సంబంధం ఏంటి? ఆ సమయంలో ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు..? లోకేష్‌. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను ఎవరికి పెట్టాడు..? తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement