కర్నూలు బ్యూరో : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు కర్నూలు జిల్లాలో న్యాయవాదులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఇవాళ కర్నూల్ నగరంలోని జిల్లా న్యాయస్థానం ఎదుట న్యాయవాదులు ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు.
గత ప్రభుత్వంలో అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకించిన సంగతి విధితమే. ఈ యాక్ట్ ను రద్దు చేయాలని గతంలో న్యాయవాదులు నెలరోజులపాటు కర్నూలులో ఉద్యమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేసిన సంగతి విధితమే. దీంతో న్యాయవాదులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మునిస్వామి, దాశెట్టి శ్రీనివాసులు, దామోదరం, ఎమ్మెస్ కే నాయుడు, తదితరులున్నారు.
- Advertisement -