Wednesday, November 20, 2024

Law Nestam – పేద‌ల‌కు న్యాయ చేయండి…మాన‌వ‌తాదృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించండి…..జ‌గ‌న్

తాడేప‌ల్లి: కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంద‌ని, ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో యువ లాయ‌ర్లు పేద‌వారికి న్యాయం చేయాల‌ని, మాన‌వ‌తాదృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. రాష్ట్రంలో జూనియర్‌ న్యాయ­వాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవి­డత వైయ‌స్ఆర్‌ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరునెలలకు ఒక్కొ­క్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు. నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement