టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును చంద్రబాబు ఎంపిక చేశారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారు. ఇక కోశాధికారిగా దగ్గుమల్ల ప్రసాద్‌ను నియమించడం జరిగింది. లావు.. నరసారావుపేట నుంచి రెండోసారి ఎంపీగా గెలవగా.. శబరి తొలిసారి గెలిచారు. ఈ ఇద్దరూ కూడా ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వారే. ఇక దగ్గుమల్ల ప్రసాద్.. చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన ఈయన.. రాధే కన్స్ట్రక్షన్స్ నడిపిస్తున్నారు. శనివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలసేపు కొనసాగిన ఈ సమావేశంలో.. మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను ఎన్నుకోవడం జరిగింది..
ఈసారి లోక్‌సభలో టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలని చంద్రబాబు సూచించారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసికట్టుగా ఎంపీలు అందరూ ఉండాలని.. ఏ మాత్రం సందేహాలున్నా సరే వెంటనే తనకు తెలియజేయాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎంపీలకు చంద్రబాబు చెప్పారు.