తిరుమల – గతేడాధి శ్రీవారిని 2.52 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో రూ. 1,398 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కును దాటడం గమనార్హం. జూలైలో అత్యధికంగా రూ.129 కోట్లు రాగా, నవంబర్ లో అత్యల్పంగా రూ.108 కోట్లు చేకూరాయి. మరోవైపు నిన్నటితో వైకుంఠ ద్వార దర్శనం ముగిసింది.
ఇదిలా ఉండగా, నేటి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీవారిని 63,358 మంది భక్తులు.. దర్శించుకున్నారు. అలాగే నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 19,534 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లుగా నమోదైంది. ఇక నేడు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది..