వాల్తేర్ రైల్వే డివిజన్‌లోని కెకె లైన్‌లోని మనబార్-జరాతి స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి.. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. అలాగే ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దుచేయడం, మరికొన్నింటిని వేరే మార్గంలో నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.. కొండచరియలు తొలగించి పని యుద్ద ప్రాతిపాదికను కొనసాగిస్తున్నారు..
రద్దు దారి మళ్లించిన రైళ్ల వివరాలు
- రూర్కెలా నుండి 23.09.2023న బయలుదేరే రూర్కెలా-జగ్దల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నెం.18107 కోరాపుట్‌లో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది కోరాపుట్ నుండి రూర్కెలాకు 18108గా ప్రారంభమవుతుంది, అందువల్ల కోరాపుట్-జగ్‌దల్ మధ్య సర్వీసు రద్దు చేశారు
- భువనేశ్వర్‌లో బయలుదేరే రైలు నెం. 18447 భువనేశ్వర్-జగ్దల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్‌లో షార్ట్ టర్మినేట్ చేశారు. తిరిగి ఈ రైలు కోరాపుట్ నుండి భువనేశ్వర్‌కు బయలుదేరుతుంది. అందువల్ల కోరాపుట్ – జగదల్‌పూర్ మధ్య సర్వీసు రద్దు చేశారు.
- విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నం. 18514 విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్‌లో నిలిపివేస్తున్నారు.. తిరిగి ఈ రైలు కోరాపుట్ నుండి 18513గా విశాఖపట్నంకు తిరిగి వస్తుంది. అందువల్ల కోరాపుట్ – జగదల్‌పూర్ మధ్య సర్వీసును రద్దు చేశారు.
- విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నం. 08551 విశాఖపట్నం-కిరండూల్ నైట్ ప్యాసింజర్ కోరాపుట్ వరకు మాత్రమే నడుపుతున్నారు.. కోరాపుట్ నుండి విశాఖపట్నంకు 08552గా తిరిగి వస్తుంది.
- రైలు నెం.08552 కిరండూల్ -విశాఖపట్నం ప్యాసింజర్ 24.09.2023న జైపూర్ వరకు నడుస్తుంది. తిరిగి జైపూర్ నుండి కిరండూల్‌కు 08551గా తిరిగి వస్తుంది. అందువల్ల జైపూర్ – కోరాపుట్ మధ్య ఈ రైలు సర్వీసు ను నిలిపివేశారు.
- రైలు నెం. 18006 జగదల్‌పూర్-హౌరా సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఈరోజు జగదల్‌పూర్‌లో బయలుదేరి జైపూర్ లో నిలిపివేయనున్నారు.. ఖాళీ రేక్ తిరిగి జగదల్‌పూర్‌కు చేరుకుంటుంది.