వైసిపి గ్యాంగ్ పేనే నంటూ సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు
తనను కిడ్నాప్ చేసి రిజిస్ట్రేషన్ చేయించారని సిఎంకు మొర
పూర్తి స్థాయి విచారణకు చంద్రబాబు ఆదేశం
రంగంలోకి దిగిన ఎసిబి..
వెలగపూడి. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది.. ఏపీలో 700 కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది. విజయవాడ, ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలం రేపుతుంది. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించారని సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్, ఇబ్రహీంపట్నం కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్‌లో రీతు చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎం వైఎస్‌జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయి. రీతు చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య.
ఇక కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా రూ. 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
ఇక సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ లో జరిగిన భారీ స్కామ్ గురించి బయట పెట్టారు. ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు, చీమకుర్తీ శ్రీకాంత్, ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు ఆయన అన్నారు. రీతూ అసలు పేరు వనం దివ్య.. చీమకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య.. వీరిద్దరి తో పాటుగా మరికొంత మంది పేరు మీద భూములు రిజిస్టేషన్ అయ్యినట్లు వార్తలు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు.
అది అంతా అబద్దం ..శ్రీకాంత్
ఈ స్కామ్ గురించి తాజాగా చీమకుర్తి శ్రీకాంత్ బిగ్ టీవీ తో మాట్లాడారు.. అసలు నిజాలను బయటకు పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. “ధర్మా సింగ్ అనే వ్యక్తి ఒక ఫ్రాడ్.. రిజిస్టర్ గా ఉంటూనే అనేక సార్లు లంచాలు తీసుకున్నారని అన్నారు.. ఆయన నా పేరు మీద 700 కోట్ల భూములు ఉన్నట్లు చెప్పారు. నా పేరు మీద ఎక్కడ ఉన్నాయి? ఎవరు పెట్టారు చెప్పండి. ఒకవేళ మీరు ఉన్నాయని నిరూపిస్తే వాటిని ఎవరి పేరు మీద రాయమంటే వారి పేరు మీద రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సింగ్ లంచగొండి.. ఆయన పేరు మీద ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద 3.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఎక్కడ నుంచి వచ్చాయి. అలాగే నన్ను జగన్ బినామీ అని భారతి బినామీ అని అన్నారు కదా.. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏసీబీకి కేసులు పెట్టారు.. ఆ కేసులు ఇప్పటికీ నామీద ఉన్నాయని అందరికీ తెలుసు కానీ నేనెలా జగన్ కి బినామీగా ఉంటాను. నేను నా భార్య దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. అసలు నిజా నిజాలు ఏంటో పోలీసులు, ఏసీబీ అధికారులు తెలుసుకోవాలి. నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులతో పాటుగా అనేక వ్యాపారాలు చేసి కూడబెట్టుకున్న సొమ్మునే ఏసీబీ అధికారులు ఫ్రీజ్ చేశారు వాటినే ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు 700 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నిరూపించాలి” అని సవాల్ విసిరారు.. మరి దీనిపై ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది.