Tuesday, November 26, 2024

Breaking: బైరెడ్డి అనుచరుడు మధు ఇంట్లో నాటుబాంబులు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా పగిడాల మండలం కొత్త ముచ్చుమరి గ్రామంలోని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు మధు ఇంట్లో పోలీసులు నేడు నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటి యజమాని నేడు వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నాటుబాంబులు వెలుగు చూశాయి…

అల్లరి మధు అలియాస్ బోయ మధు ఇంటి ఆవరణంలోని నీటి ట్యాంకును ఉదయం శుభ్రం చేస్తుండగా మూట లభించింది. దానిని బయటికి తీసి పరిశీలించగా అందులో బాంబులు ఉన్నాయని, వెంటనే ముచ్చుమరి ఎస్సై నాగార్జునకు ఫిర్యాదు చేశారు. ఈ బాంబులు ట్యాంక్ లోకి ఎలా వచ్చాయి, ఎవరు పెట్టారో తెలియదని, పిల్లలకు ఒళ్లంతా దద్దుర్లు వచ్చి జిల పెడుతుందని చెప్పడంతో ట్యాంకు నీటిని శుభ్రం చేసేందుకు వెళ్లానని, అందులో మూట దొరికిందని ఇంటి యజమాని మధు పోలీసులకు వివరించారు.

అయితే ఏడాది క్రితం ఇదే ఇంటిలో గంజాయి మూటలు ఉన్నాయని, అప్పట్లో ప్రత్యర్థి వర్గమైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. అప్పుడు ఇల్లంతా గాలించిన పోలీసులు నీళ్ల ట్యాంక్ ను చెక్ చేయలేదని వివరించారు. నీటి ప్రాబ్లం వల్ల పిల్లలకు అలర్జీ వచ్చి ఇబ్బంది అవుతుందేమోనని ట్యాంక్ ని శుభ్రం చేసేందుకు వెళ్లానని మధు వెల్లడించారు. బాంబు లభించిన ఇంటి యజమాని బోయ మధు షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ముఖ్య అనుచరుడు. గ్రామంలో జరిగే పార్టీ కార్యక్రమాలను, సోషల్ మీడియా తాలూకా ఇన్చార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్థిస్తున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement