అనంతపురం: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల వైసిపి కన్వీనర్ గా పనిచేస్తున్న.. నాయకుడు. ప్రభుత్వ దళిత ఉద్యోగులను నోటికి వచ్చినట్లు తిట్టిన ఆడియో.. జిల్లా లో హల్ చల్ చేస్తోంది. దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ధర్మవరం నియోజకవర్గం కేతిరెడ్డి ఎమ్మెల్యే అనుచరుడైన ముదిగుబ్బ మండలం కన్వీనర్ ఇందుకూరు నారాయణరెడ్డి ఆయన మండల సర్వేయర్ మండల డిప్యూటీ ఎమ్మార్వో ను అసభ్య పదజాలంతో దూషించారు.
ఆడియో వినండి:
ఒక భూమిని సర్వే చేసేందుకు వెళ్లినా సర్వేయర్‌ను.. పంపిన డి టి ని నోటికి వచ్చినట్లు.. తిట్టాడు. ఎమ్మెల్యే అంటే భయం లేదా? నేను అన్న భయము లేదా? మదనపల్లిలో ఉన్న.. అక్కడికొచ్చి చెప్పుతో కొడతా నా కొడకల్లారా.. గవర్నమెంట్ అంటే భయం లేదా? ఎవరినడిగి సర్వే కి వెళ్లారు. అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఉద్యోగులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గంలో ఉద్యోగులపై కొందరు నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడారు.