కర్నూలు జిల్లా… సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల చివరి రోజు సంధర్బంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జాతీయ సమైక్యతను చాటుతూ జిల్లా పోలీసు యంత్రాంగం యూనిటీ రన్ ను కర్నూలు లో ఘనంగా నిర్వహించారు. ఏక్తా పరుగు కార్యక్రమాన్ని కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఐక్యతా పరుగు జిల్లా పోలీసు కార్యాలయం ( కొండారెడ్డి బురుజు ) నుండి ప్రారంభమై రాజ్ విహర్ కూడలి వరకు కొనసాగింది. ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ పోలీసు సిబ్బంది బయలు దేరి రాజ్ విహార్ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న సివిల్, ఎఆర్ , ఎపిఎస్పీ పోలీసు సిబ్బందితో ఎఆర్ అడిషనల్ ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు.
“భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని , ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తూ సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. సర్థార్ వల్లబాయ్ పటేల్ యొక్క దార్శనికత, దేశ ఏకీకరణ స్ఫూర్తితో, దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తామని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాము.”
ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాష్ట్రీయ ఏక్తా దివాస్ సంధర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం ఏక్తారన్ నిర్వహించామన్నారు. భద్రత, సమగ్రత పరంగా అందరం కలిసి దేశాన్ని రక్షించుకుంటామని అక్టోబర్ 31 ని ఐక్యతా దినంగా జరుపుకుంటున్నామన్నారు. దేశ సమైక్యతను, ఐక్యమత్యాన్ని కాపాడాతామని ఈ సందేశాన్ని అందరికి తెలియజేసే విధంగా అందరూ పెద్ద సంఖ్యలో యూనిటీ రన్ లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో అస్టిసెంట్ కమాండెంట్ లు ఎస్. ఎమ్. భాషా, శ్రీనివాసులు, ఎపిఎస్పీ డిఎస్పీ భక్తవత్సలం, సిఐలు గుణశేఖర్ బాబు, పవన్ కుమార్, రామయ్యనాయుడు, నాగశేఖర్, జాన్సన్, ఆర్ ఐలు పోతల రాజు, వి. యస్ రమణ, శివారెడ్డి, పైడిరాజు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, నారాయణ, సాయికుమార్, ప్రసాద్, రవికుమార్, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.