Tuesday, November 26, 2024

Kurnul – అక్రమంగా ఖనిజం తరలిస్తున్న వాహనాల పట్టివేత.

కర్నూలు, సెప్టెంబర్ 20, ప్రభ న్యూస్ బ్యూరో. డోన్ కేంద్రంగా అక్రమంగా ఖనిజం తరలిస్తున్న రెండు లారీలపై శుక్రవారం కర్నూలు జిల్లా భూగర్భ ఖనిజం వనరుల మైనింగ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డోన్ నుంచి డోలమైట్ పౌడర్ ను రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి సమాచారం అందించారు.

సమాచారం మేరకు డోన్ సమయంలో వెళ్తున్న రెండు లారీలను ఆపి తనిఖీలు చేయగా, అందులో డోలమేడ్ పౌడర్ ను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు మైనింగ్ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో రెండు లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మైనింగ్ శాఖ నిబంధన మెరుగు ఒక్కొక్క లారీ యజమానికి రూపాయలు యాభై వేలు చొప్పున అపరాధ రుసుం విధించినట్లు భూగర్భ ఖనిజం శాఖ డిడి రాజశేఖర్ వెల్లడించారు. ఈ దాడుల్లో మైనింగ్ శాఖ విజిలెన్స్ విభాగం చెందిన బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement