కర్నూలు. / తాడేపల్లి – కర్నూలు జిల్లా టీడీపీ నేతలు కప్పట్రాళ్ల దంపతులు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కర్నూలు జిల్లా టీడీపీ మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ళ బొజ్జమ్మ సుశీలమ్మ, భర్త, దేవనకొండ మాజీ ఎంపీపీ డి. రామచంద్ర నాయుడు ఫ్యాన్ గూటికి చేరారు.. వారికి పార్టీ ఖండువ కప్పి వైసిపి లోకి ఆహ్వానించారు జగన్.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ కనుమరుగు అయిందన్నారు. 40 ఏళ్లుగా టీడీపీలో ఉండి ఎన్నో నష్టాలు, కష్టాలు ఎదుర్కొన్న బొజ్జమ్మ, రామచంద్ర నాయుడు పార్టీలో చేరారని తెలిపారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని, 2024లో కూడా జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటామని తెలిపారు.
నాన్న స్థానంలో తాను టీడీపీకి పనిచేశానని బొజ్జమ్మ తెలిపారు. తమ నాన్నని చంపించిన వారిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. గుర్తించని పార్టీలో ఉండటం అనవసరం అనిపించిందన్నారు. టీడీపీ కోసమే తమ కుటుంబం బలైందని, అయినా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీల పార్టీ అంటూనే చంద్రబాబు బీసీలకు ఏం న్యాయం చేయలేదని మండిపడ్డారు. సీఎం జగన్ బీసీలకు చేస్తున్న మేలుతో తాము వైఎస్సార్‌సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. సీఎం తమకు రక్షణ కల్పిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీసీల పార్టీ అంటూనే చంద్రబాబు మోసం చేశారని.. సీఎం జగన్ బీసీలకు అనేక పదవులు ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు