Saturday, November 23, 2024

Kurnul – భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే..

క‌ర్నూలు – చెన్నై నుండి సూరత్ కు పోవు రోడ్డులో ఎదురూరు దుద్యాల గ్రామాలలో భూములు కోల్పోతున్న రైతులకు ఒక ఎకరాకు 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రైతులతో జరిగిన సమావేశంలో రామకృష్ణ తో పాటు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు భూసేకరణ చట్టం ప్రకారం ప్రొసీజర్ అనుసరించలేదని రైతులకు నోటీస్ ఇవ్వడం కానీ గ్రామసభ నిర్వహించడం కానీ వారి సమక్షంలో ధర నిర్ణయించడం కానీ జరగలేదని రైతుల సమక్షంలో ధర నిర్ణయించకుండా బలవంతంగా భూములు సేకరించడం అత్యంత తక్కువ నష్టపరిహారం కేవలం ఎకరాకు ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం అంటే రైతుల గొంతు కోయడం తప్ప మరొకటి కాదని ఆయన విమర్శించారు.

మంగళవారం కలెక్టర్ ముందు హాజరైన రైతులు వారి ఆవేదనను వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. రిజిస్టర్ వాలివేషన్ ప్రకారం ధర కట్టామని చెప్పి అత్యంత తక్కువ ధర ఉన్నది తీసుకొని నష్టపరిహారం ఇవ్వడం రైతులకు అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన విమర్శించారు ఒక ఎకరా కోటిన్నర రూపాయలు చేస్తుందని అటువంటి భూమిని కేవలం 7 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం తగునా ఇదేనా రైతు ప్రభుత్వం అంటే అని ఆయన నిలదీశారు ఆర్బిట్రేషన్ సమయంలో కలెక్టర్ పూర్తిగా రైతులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు రై.తులందరూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఐక్యమై ఇటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల నుండి వందలాది మంది రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement