Friday, November 22, 2024

Kurnul – శభాష్ పోలీస్ – 12 గంటల్లోనే ₹18 లక్షలు రికవరీ

మోసగాళ్లు.రసాయనాల్లో ముంచి రెట్టింపు నగదు ఇస్తామని మోసం..

నమ్మిన బాధితుడి నుంచి నగదు తీసుకొని పరార్..

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..

- Advertisement -

12 గంటల్లోనే వలపన్ని కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు.

ఆంధ్రప్రభ స్మార్ట్ – కర్నూలు బ్యూరో : రసాయనాల్లో ముంచి రెట్టింపు నగదు ఇస్తామని ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని నమ్మించి రూ 18 లక్షల నగదుతో ఉడా ఇచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే బాధితుని ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు ఆ కేటుగాళ్లను కటకటాల వైపు నెట్టారు..

వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి. కర్నూల్ నగరంలోని భాస్కర్ నగర్ చెందిన 40 ఏళ్ల సయ్యద్ మహామ్మూద్ స్థిర వ్యాపారి. కాగా ఈనెల 19 తేదీన అతను కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చితనకు నెల్లూరు జిల్లాకు చెందిన నాయుడు అనే వ్యక్తి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వ్యాపారములో పరిచయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన డబ్బును కెమికల్స్ కలిపి రెట్టింపు చేస్తానని నాయుడు నమ్మబలికి, తన వద్ద నుండి రూ.5 లక్షలు తీసుకొని, ఏవో కెమికల్స్ కలిపి, ఏదో చేసి, రూ. 10 లక్షలు తనకు ఇవ్వడం జరిగిందని ఫిర్యాదుల పేర్కొన్నారు. తను అతన్ని నమ్మి, డబ్బుకు ఆశపడి తన బ్యాంకు ఖాతాతో పాటు తన స్థిర వ్యాపార ఖాతాలో ఉన్న నగదు రూ.19. 50 లక్షలుడ్రా చేసినట్లు నగదు రెడీ చేసిన అనంతరం నిందితుడు నాయుడుకు తెలిపారు.

సోమవారం కర్నూలు టౌన్ చేరుకున్న నాయుడు అతనితో పాటు మరో వ్యక్తి అశోక్ నగర్ లో ఉన్న సయ్యద్ మహమ్మద్ కార్యాలయంకు చేరుకున్నారు. ఆ తర్వాత బాధితుడు ఇచ్చిన నగదును రూ.19,50 లక్షలను ఒక టబ్బులో వేసి, ఏదో ద్రావణము డబ్బు కట్టలపై చల్లి, మూతవేసి, తను గమనించకుండా డబ్బు కట్టలను తీసుకొని, తెలుపు, నలుపు కాగితాల కట్టలను టబ్బులో ఉంచారు.ఆ తరువాత మెషిన్ తెస్తామని చెప్పి, తన డ్రైవరుతో పాటు పంపిన తన కారులో వెళ్ళి, కర్నూలు పెద్దాసుపత్రి వద్ద టిఫిన్ చేస్తామని చెప్పి కారు దిగి, తన డబ్బుతో ఉడాయించారని, దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన సయ్యద్ మహమ్మద్ కర్నూల్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు రెండవ పట్టణ సిఐ నాగరాజు నేతృత్వంలో టౌన్ క్రైమ్ నెంబరు. 128/2024 U/s 318(4) రెడ్ విత్ 3(5) బి.ఎన్.ఎస్ , పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయము 9 గంటలకు నిందితుడైన ప్రకాశం జిల్లా, దర్శి తాలూకా, తాళ్లూరు మండలం , మాధవరం గ్రామం బీసీ కాలనీ చెందిన చిన్న సుబ్బరాయుడు అలియాస్ నాయుడును కర్నూల్ రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం అతని వాగ్మూలం రికార్డ్ చేశారు. సయ్యద్ మహమ్మద్ మోసగించి తీసుకొన్న నగదులో అతని వద్ద నుంచి రూ.18.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పెద్ద మనుసుల సమక్షములో పంచనామా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement