Saturday, November 23, 2024

కోతలకు వేళాయే.. గంటల తరబడి క‌రెంట్ క‌ట్‌

ప్రభన్యూస్ : క‌ర్నూలు జిల్లాలో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. డిమాండు కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈఎల్‌ఆర్‌ పేరుతో విద్యుత్‌ సరఫరా ఆఫ్‌ చేస్తున్నారు. పరిశ్రమలకు రెగ్యులర్‌ హాలిడేతో పాటు- సోమవారం పవర్‌ హాలిడే ప్రకటించారు. ఫలితంగా వారంలో ఐదు రోజులు మాత్రమే పరిశ్రమలు పని చేయనున్నాయి. 24 గంటలు పని చేసే పరిశ్రమ అయితే రోజూ వినియోగించే విద్యుత్తులో 50 శాతమే వాడాల్సి ఉంటు-ంది. మున్సిపాలిటీ కార్పొరేషన్‌ పరిధిలో రోజూ అరగంట పాటు విద్యుత్‌ కోత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో గంట పాటు కోత విధించేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలిసింది.

జిల్లాలో అన్ని విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి 16.4 మిలియన్ల వినియోగం ఉంది. వేసవి నేపథ్యంలో విద్యుత్‌ వాడకం బాగా పెరిగింది. 11.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా అందిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 400 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేసేందుకు అధికారులు కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు- తెలిసింది. జిల్లాలో గృహ కనెక్షన్లు11.7 లక్షలు. వ్యవసాయానికి సంబంధించి1.99 లక్షలు వాణిజ్యానికి సంబంధించి11.741 కనెక్షన్లు ఉన్నాయి.

ఇప్పటికే విద్యుత్‌ కోతలతో విద్యార్థులు. రైతులు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు. వైద్యశాలలు. నాపరాతి పరిశ్రమ లు. అవస్థలు పడుతున్నారు. 24 గంటలు పని చేసే పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ వినియోగించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో నాపరాతి పరిశ్రమలు1100 వరకు ఉన్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 25 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. నిత్యం రూ 600 నుంచి 750 వరకు కూలి పొందుతున్నారు. విద్యుత్‌ అంతరాయం కలగడంతో రూ రెండు వందల రూపాయలకు పడిపోయింది. కార్మికులకు ఉపాధి కరవై రోజులు ఎదురవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement