Tuesday, November 26, 2024

సాగునీరిచ్చి రైతులను ఆదుకుంటాం : మంత్రి జయరాం

ఆలూరు : కర్నూల్ జిల్లా ఆలూరు నియోజక వర్గంలో హలహర్వి, హోలగుంద మండలాలలో ప్రవహించే లో లెవెల్ కాల్వకి నీరు అందించి రైతులను ఆదుకోవాలి హాలహర్వి మండల రైతులు మంత్రి జయరాంని కోరారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజక ఇన్‌చార్జి నారాయణస్వామి ఆధ్వ‌ర్యంలో కలిశారు. రైతులు వేసిన పంటలు అధిక వర్షానికి పత్తి, మిరప, వరి ఇతర పంటలు దెబ్బతిన్నాయి. మరో పక్క లో లెవెల్ కెనాల్ లో నీటి ప్రవాహాన్ని గత 15 రోజులుగా ఆపేశారు. కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి జయరాం లో లెవెల్ కెనాల్ అధికారులను ఆదేశించారు. లో లెవెల్ కెనాల్ అధికారులు ఫోన్లో మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో లో లెవెల్ కెనాల్ కు నీరును వదులుతామ‌ని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లింగప్పా, చింతకుంట సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు, మండల కన్వీనర్ బీమప్ప చౌదరి, వైస్ ఎంపీపీ నగేష్ నాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు కర్ణ, బసవరాజు, దిబ్బలింగా, గోవిందు, నిట్రవటి లక్ష్మన్న, రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement