కోవిడ్ నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆన్ లైన్ ద్వారా స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి ఆన్ లైన్ లో 39 ఫిర్యాదులు వచ్చాయి. ఆన్ లైన్ లో ఫిర్యాదు దారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ఫిర్యాదు లో ప్రధానంగా హెచ్డీఎఫ్సి బ్యాంకు ఉద్యోగానికి ఎంపికైనవని సైబర్ నేరగాళ్ళు ఫోన్ కు మేసేజ్ చేసి, అన్ లైన్ లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని, హెచ్ ఆర్ డిపార్టు మెంట్ నుండి ఆన్ లైన్ ఎగ్జామినేషన్ రౌండ్ ఉంటుందని అందులో సక్సెస్ అయితే హెచ్ డి ఎఫ్సీ బ్యాంకులో అకౌంటెంట్ ఉద్యోగం ఉంటుందని, ఆన్ లైన్ లోనే సర్ఠిఫికెట్ వెరిఫికేషన్ అని, బ్యాంకు అక్కౌంట్ ఓపెన్ చేయాలని, మొత్తం రూ. 17,500 ఫోన్ పే లో వేయించుకుని సైబర్ నేరగాళ్ళు మోసం చేశారని కర్నూలు అశోక్ నగర్ కు చెందిన వినోద్ కుమార్ ఫిర్యాదు చేశారు.
అలాగే భర్త అత్త, మామలు తనను బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నారని నంద్యాల, కాంతినగర్ కు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. తన టిప్పర్లను, క్రషింగ్ మెషిన్ లను ఇతరులకు అమ్మివేసిన వారి పై చర్యలు తీసుకోవాలని నంద్యాల, వెంకటాచలం కాలనీకి చెందిన ఇస్మాయిల్ ఫిర్యాదు లో పేర్కొన్నారు. తన పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పెద్దకడుబూరు గ్రామానికి చెందిన రాముడు ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..