Friday, November 22, 2024

సంప్రదాయం తప్పిన ఈ నియంతృత్వ పీఆర్​సీ మాకొద్దు.. ఆందోళనలో ఉద్యోగులు

రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు మంగళవారం ఏపీలోని అన్నీ జిల్లాలోని పాఠశాలల్లో రెండో రోజు కూడా ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. పీఆర్​సీ మాకొద్దు అని నల్లబ్యాడ్జి లు ధరించి పాఠశాలల్లో విధులు నిర్వహించారు. రాష్ట్ర ఫ్యాప్టో అప్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వసంతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ గత 10 పీఆర్​సీలలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను నియంతృత్వ ధోరణిలోకాలరాస్తున్నారు. 11 వ పీఆర్​సీ పేరుతో అంతకుముందు 12 సార్లు చర్చలు జరిపిన, మొన్న రెండు రోజులు చర్చలు అన్నా ఇక్కడ చర్చలు ఏమి లేవు, ప్రభుత్వ పెద్దలు చేయాలన్నది వారి భజనపరులతో మమ అనిపించి బలవంతంగా రుద్దటమే తప్ప మరి ఏమి కాదన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement