Monday, November 25, 2024

బనవనూరుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందిస్తా : మంత్రి జయరాం

ఆస్పరి మండల పరిధిలోని బనవనూరు గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందిస్తానని, గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తానని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. సోమవారం బనవనూరు గ్రామంలో గడప గడప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి గుమ్మనూరు జయరాం, వైఎస్ఆర్సిపీ ఆలూరు తాలుక ఇన్ చార్జి గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ పథకాలను మన వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ గ్రామానికి ప్రభుత్వం 5 కోట్ల 42 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని, రోడ్లు లేవు అంటే రూ.60 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ రాఘవేంద్ర, జడ్పీటీసీ దొరబాబు, బనవనూరు సర్పంచ్ పెద్ద రెడ్డి, సింగిల్విండో చైర్మన్ గోవర్ధన్, మాజీ మండల కన్వీనర్ రామాంజనేయులు, మండల కన్వీనర్ పెద్దయ్య, ఆలూరు మండల కన్వీనర్ వీరేశ్, వైఎస్ఆర్సిపి నాయకులు ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement