Friday, November 22, 2024

ZPTC పదవికి రాజీనామా చేసిన విరుపాక్షి..

చిప్పగిరి మండల జడ్పీటీసీ విరుపాక్షి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎన్నో సంవత్సరాలుగా వైయస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైస్సార్సీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశాను. తన సేవను గుర్తించి ప్రజాస్వామ్యబద్ధంగా జడ్పీటీసీ అభ్యర్థిగా తనను ప్రకటించారు. తన మంచితనాన్ని గుర్తించిన తమ మండల అన్ని పార్టీల మద్దతుతో తాను ఏకగ్రీవంగా జడ్పీటీసీగా ఎన్నికయ్యాను. అయితే నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అనుచర వర్గం పదేపదే ప్రతి పార్టీ మీటింగ్ లోనూ, బహిరంగ సభలోనూ గుమ్మనూరు బిక్ష అని మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ గుమ్మనూరు బిక్ష తనకు అవసరం లేదు. అందుకే తాను పదవికి రాజీనామా చేస్తున్నాను. తాను జగన్మోహన్ రెడ్డి పై అభిమానం ఉన్నంతవరకు వైఎస్ఆర్సిపి పార్టీలో కొనసాగుతూ పార్టీకి సేవ చేస్తానని, జగనన్న ఆశయాల కోసం కృషి చేస్తానని B.విరుపాక్షి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement