Sunday, November 3, 2024

AP | రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు !

కర్నూలు జిల్లా (గోనెగండ్ల) : కర్నూలు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి జిల్లా అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గోనెగండ్ల మండలం లో ఉన్న ఎఫ్ పి షాపులపై పౌర సరఫరాలో రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు.

ఈ దాడులు విజిలెన్స్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కే సునీల్ కుమార్, ఐఓపి సిద్దయ్య, అసిస్టెంట్ జియాలజిస్ట్ రమణ, డి సి టి వ్యవసాయ అధికారి వివిధ రేషన్ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండల కేంద్రమైన మంజుల, ఆర్ హిమం పటేల్, రమణ కుమారి షాపులలో తనిఖీ చేయగా షాప్ నెంబర్ మూడు, షాప్ నెంబర్ 1 లో స్టాక్ లో తేడాలు గుర్తించినట్లు వారు తెలిపారు.

షాప్ నెంబర్ నాలుగులో 143 కేజీల కొరత ఉన్నట్లు గుర్తించి ఆ స్టాక్ ను పంచనామా చేసి సి ఎస్ డి టి కి స్వాధీనం చేసి సిక్స్ ఏ కింద కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న స్టాకును విఆర్ఓ కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అలాగే కె వీరన్న, మహబూబ్ బాషా నాకు చెందిన షాపుల్లో అలాగే డీలర్ సిద్ధప్ప చెందిన షాపులో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు.

డీలర్ అక్బర్ సాహెబ్ కు చెందిన షాపులో 1115 కిలోల 45 బియ్యం అదనపు స్టాకు ఉన్నట్లు గుర్తించామన్నారు. అదనపు స్టాకును పంచనామా సిఎస్డిటి 2 కు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అదనపు స్టాకు దొరికిన షాపులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement