Friday, November 22, 2024

ఔరా అనిపించుకున్న రైతు.. 4 ఎకరాల్లో 250 బస్తాలు వరి పంట పండించిన వీరేష్‌..

హోళగుంద, ప్రభన్యూస్‌ : మండల కేంద్రం హోళగుందకు చెందిన తోక వెంకటేష్‌, శారదమ్మ దంపతుల కుమారుడు యువ రైతు, మేజర్‌ గ్రామ పంచా యతీ వార్డు సభ్యుడు తోక వీరేష్‌ రబీ సీజన్‌లో 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఎకరాకు 62 బస్తాలు వరి పంటను పండించి ఔరా అనిపించాడు. గంగా కావేరి రకానికి చెందిన విత్తానాన్ని సాగు చేశాడు. ఆర్గానిక్‌ ఎరువులుతో పాటు కొంత ఫర్టిలైజర్‌ ఎరువులు, మందులను పిచికారి చేసి ఎకరాకు 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎకరాకు 62 బస్తాలు దిగుబడి రావడంతో సుమారు ఎకరాకు 40 వేలు వరకు ఆదాయం సమకూరిందని రైతు అన్నారు. అలాగే గ్రామంలో వార్డు సభ్యుడిగా ఎన్నికై ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ రైతు వీరేష్‌ ప్రజలతో శభాష్‌ అనిపించుకున్నాడు.

ఈ సందర్భంగా రైతు తోక వీరేష్‌ మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్‌ఎల్‌సీ దిగువ కాలువలో పుష్కలంగా నీరు ఉండడంతో వరి పంట మంచిగా పండించుకోవడంతోపాటు మంచి దిగుబడి సాధించడంతో చాలా తృప్తిగా ఉందన్నారు. అదేవిదంగా ప్రజల సహాయ సహకారాలతో గ్రామంలో సేవ కార్యక్రమాలు చేస్తానని యువ రైతు, వార్డు సభ్యుడు తోక వీరేష్‌ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement