Wednesday, November 20, 2024

క‌ళా సంప‌ద‌ను కాపాడతాం – వాణి మోహ‌న్

ఆళ్లగడ్డ – ఎపిలోని కళా సంపద అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అన్నారు. శుక్రవారం ఆళ్లగడ్డ మండలంలోని అహోబిల క్షేత్రాన్ని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆర్లగడ్డ శాసనసభ్యులు గంగుల బీజన్ద్రనాథ రెడ్డి కలెక్టర్ వీరపాండియన్ నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి లతో కలిసి సందర్శించారు. అహోబిల క్షేత్రం లోని నరసింహ స్వామి దేవాలయాన్ని,దేవాలయ ప్రాంగణం లో ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం టూరిజం గెస్ట్ హౌస్ లోని సమావేశ మందిరంలో పవర్ ప్రాజెక్టు ద్వారా శిల్ప సంపదను గురించి ప్రదర్శనను తిల‌కించారు… ఈ సంద‌ర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్ మాట్లాడుతూ దేవాలయంలోని శిల్పకళా సంపదను కాపాడేందుకు ఆధునిక టెక్నాల‌జీని ఉప‌యోగిస్తున్నామ‌న్నారు…కొత్త టెక్నాల‌జీతో శిథిల‌మైన శిల్పాలు సైతం నిత్య నూతనంగా ఉంటున్నాయ‌న్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థానం కార్యనిర్వాహక అధికారి వెంకట నరసయ్య మటమ్ ప్రతినిధులు సంపత్ కుమార్ ఆర్లగడ్డ తహసీల్దార్ రమేష్ రెడ్డి డి.ఎస్.పి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement